"నిజాం కు ఘోరి కడితే న్యాయం జరిగిందా మనకు ! అన్యాయమే(నా) బ్రతుకంతా అడిగుతోంది తెలంగాణా !" అని 'బతుకమ్మ' సినిమాలో అందెశ్రీ పాట రాసుకున్నాడు. అవును అన్యాయం, నిరంకుశత్వం రూపం మారింది, తరతరాలుగా కొనసాగుతోంది. అది సీమాంధ్రకు చెందిన కొందరు వ్యక్తులు అని నిర్మొహమాటంగా తెలంగాణకు చెందిన స్కూలుకు పోయే పోరడు కూడా చెప్తడు. తెలంగాణా యాస లో మాట్లాడితే కింది నుండి పైదాక చూస్తారు కొందరు, అదేదో నేరం అయినట్టు. ఇటు తెలంగాణాలో నాణ్యమైన విద్యకు సదుపాయాలు సరిగ్గా లేవు, ఈ ప్రాంతం ఇంగ్లీషు వాళ్ళ చేత పాలించబడలేదు, క్రిస్టియన్ మిషినరీస్ లేవు. ఉన్నదల్లా నిరంకుశ నిజాం ప్రభుత్వాలు, ఉర్దూ మీడియం స్కూళ్ళు, అపుడు బలవంతంగానే మాది కాని భాషను నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా అంతే, మావి కాని వాటిని ఎన్నింటినో నేర్చుకుంటున్నాం. మా సంస్కృతి కల్తీ అయింది. ఉనికినే కోల్పోతోంది. మమ్మల్ని మేం ఏవిదంగా ఎదుటివాళ్ళకు చెప్పుకోవాలో తెలియని అసహాయస్థితి. ఇది అస్థిత్వాన్ని కాపాడుకోవాలనుకొనే ఆరాటం. పోరాటం. ఇపుడు మా యాస రోతగానే ఉంటుంది,మా సంస్కృతి వికారంగానే ఉంటుంది. అవును వాళ్ళకు పెద్ద, పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, వ్యవసాయంలో లాభాలు పెరిగాయి, ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించారు, ప్రసార మాధ్యమాలు స్థాపించారు, వాళ్ళ భాషనే ప్రామాణికమైనదిగా, వాళ్ళ సంస్కృతినే ఉత్తమమైనదిగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు, తెలంగాణా భాషను, సంస్కృతిని హీనమైనదిగా చిత్రీకరించారు. ఇది హింస. భాష, సాంస్కృతికపరమైన హింస, మానసిక హింస కాదా? మాకంటూ ఒక సంస్కృతి లేదా? దాన్ని గౌరవించాల్సిన భాద్యత ఆంధ్ర వాళ్ళకు లేదా? సాంస్కృతిక, నాగరికతపరమైన అంతరాలు పెరిగిపోయే ప్రమాదాన్ని విలీనం చేసేటపుడు పెద్ద మనుషులు ఉహించాలేదా? మొదట్లోనే ఆ అంతరాల్ని తగ్గించే ప్రయత్నాన్ని ఎవరూ ఎందుకు చేయలేదు? విలీనం వెనుక దాగి ఉన్న ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి అనే నమ్మకం రాగానే సంస్కృతీ, నాగరికతల గోల ఎందుకని వదిలేశారా? విలీనం రాజకీయంలో బాగం కాదా? రాజకీయ కుట్ర కాదా? అది రాజకీయ నిరుద్యోగులది కాదా? అపుడు ఎవరి ఏకాభిప్రాయంతో ఈ మోసానికి ఒడిగట్టారు? ఏ ప్రాంత ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కోరారు? ఏ అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశ పెట్టారు? ఎంత మెజారిటీతో ఆమోదించారు? ఎవరి అనుమానాలను నివృత్తి చేశారు?
రాజకీయవాదులు ఇలాంటి అంతరాలను తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటే తప్పేంటి? అది రాజకీయాల్లో ఒక బాగం. సహజంగానే రాజకీయ నాయకులు ఇలాంటి అవకాశాలు, అంతరాల కోసమే ఎదురు చూస్తారు లేదా సృస్టిస్తారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఇంతదాకా వచ్చింది? కారకులు ఎవరు? వాళ్ళకి శిక్ష ఏంటి? విలీనంతో తెలంగాణా ఎంత మూల్యం చెల్లించిందో ఏ కమిటి నిర్ధారణ చేయగలదు? ఆ నివేదికలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోగలవు?
అసలు తెలంగాణా -ఆంధ్ర సమస్యను "జాతుల పోరాటం"గా వర్ణించాడు ఈ మధ్య ఒక మహానుభావుడు. అపుడు బలవంతంగానే మాటలు కలిసాయి, మనస్సులో ఏదో తెలియని అసౌకర్యం. భాషలో సారుప్యత ఉన్నా, యాస లో ఎంతో తేడా ఉంది. తెలుగు భాషగా ఉండటం తెలంగాణా వాళ్ళ పాలిట శాపమైంది. అది ఎన్ని దశాబ్దాల తర్వాత విమోచనం అవుతుందో ఎవరు మాత్రం ఉహించగలరు? 'చీమ చిటుక్కుమన్నా హైకమాండ్ కు విన్నవించుకొని, అక్కడి నుండి వచ్చే ఆజ్ఞ తర్వాతే ఏదైనా చేసే నీచ రాజకీయవాదులను మనం ఎన్నుకుంటున్నామా? అని ప్రజల్లో ఎప్పుడు చైతన్యం వస్తోందో అని ఎదురుచూస్తున్నా! ఇది మన సమస్య మనమే ఎందుకు పరిష్కరించుకోలేం అనే విచక్షణ మన ప్రజా ప్రతినిధులకు ఎపుడు వస్తుందో అని కూడా ఎదురుచూస్తున్నా!
చివరగా, ఎన్నో పోరాటాల చరిత్ర, స్పూర్తి కలిగిన తెలంగాణా మనది. దాన్ని పూర్తిగా చదువుదాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నా విద్యార్ధి సోదర, సోదరీమణుల్లారా ! ఆత్మ హత్య ల సంస్కృతి మనది కాదు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులకైన, నిరంకుశ ధోరణులకైనా ఎదురునిల్చి పోరాడిన చరిత్ర మనది. పోరాటం మన నైజం. ఒక్కొక్కరైనా సరే బ్రతికి పోరాడి భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్నిద్దాం.
----DSTలో బతుకమ్మ సినిమాచూసాక రగిలినస్పూర్తితో..!!

3 comments:
hi santooo
i didnt see ur blog at right time sorry man.ide spoorthi tho andron valasa vadulaku ghori kadadam
jai telangana!
baabaay nenoka chinna msg pedathanu...
kastalatho paiki edhagatam kante
pooratam chesi paiki ravatam utthamam.
jeevithamtho pooratam kante brathuku pooratam dhurlabham.
jeevinchadam kante, pooradatam kaashtam...
kaaneee....
jeeevitham oka aluperugani pooraatam......
Post a Comment