'ప్రేమ' అనేది యువతను ఎప్పటికి ఉల్లాసపరిచేదే. ఆ పదంలోనే ఏదో మత్తు దాగి ఉన్నట్టుంది. దాని గురించి మాట్లాడుకోవడం అన్నా, వినడం, చదవడం అన్నా ఆసక్తిగానే ఉంటుంది. ప్రేమను మొదలు పెట్టడం సులభం, కానీ దాన్ని నిలుపుకోవడం అనేది మాత్రం ఒక కళ. ఈ మధ్య, ప్రేమించుమనో, ప్రేమిస్తున్న అమ్మాయి దక్కలేదనో, కొందరు యువకులు హింసాత్మక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది ఆధునిక సమాజానికి మచ్చ లాంటిది, అభ్యున్నతికి అవరోధం కుడా. 'ప్రేమ' అనే ప్రయాణంలో పెళ్లి ఒక మలుపు లాంటిదే కానీ అదే గమ్యం కాదు అని నా అభిప్రాయం. ''సఫలం అయిన ప్రేమ పెళ్లి వరకు, విఫలం అయిన ప్రేమ చితి వరకు" అని తనికెళ్ళ భరణి గారు అన్నట్టు, పెళ్లి మాత్రమే పరమావధి కాకూడదు. కొన్ని సామజిక లేక వేరే ఇతర కారణాల వల్లనో ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోలేకపోవచ్చు, కానీ వారి ప్రేమను ఎవరు, ఏ శక్తి అడ్డుకోగలదు? ప్రేమ అనేది మనస్సుకు సంబంధించింది. ప్రేమ తర్వాత పెళ్లి అనేది కేవలం ఒక సంఘటనగా అభివర్ణిస్తాను. అది జరిగినా , జరుగక పోయినా ప్రేమ జీవనదిలా మనసులో ప్రవహిస్తూ ఉండాలి. దేన్నీ ఆశించకుండా, అనునిత్యం, ఎదుటి వ్యక్తి క్షేమం కోరేదే ప్రేమంటే. ప్రస్తుత సమాజంలోని చాలా మంది యువకులు ప్రేమంటే తమ ప్రియురాలిని సొంతం చేసుకోవడం లేదంటే, కాదంటే, అంతం చేయడం అని భావిస్తున్నారు, బ్రమల్లో జీవిస్తున్నారు. నిజానికి మన సాహిత్యం, ప్రసార మాధ్యమాలు ప్రేమకు సరైన నిర్వచనాన్ని ఇవ్వడంలో విఫలం అయ్యాయి అనే చెప్పుకోవాలి. లేదంటే ప్రేమించే అమ్మాయిపై పలురకాల దాడులకు దిగడం అనే ఆలోచనావిధానం ఎక్కడి నుండి వచ్చింది? విచక్షణ అనే దాన్నే మరిచిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు మన కుటుంబం లో జరిగితే తట్టుకోగలమా ! భావి భారత పౌరుల్లారా ఇక ముందైన మనం మనుషుల్లాగా వ్యవహరిద్దాం, కొన్ని మానవ విలువల్ని భావి తరాల కోసం కాపాడుదాం !!
ఏమంటారు ?!

1 comment:
Babai Chal bagundi,,,Super,,It realy nice to see ur article
Post a Comment